11.3.08

కవి

ఎక్కడో.. అందని దూరాన ఉన్న

అనంత ఆకాశంలోని ఒక చిన్న తార

ఆరుబయట మంచు దుప్పటి కప్పుకుని

పడుకుని ఉన్ననాకు కనిపించి

నాలో భావావేశం రగిలించి ఊహలకు ఊపిరినిచ్చి

ఆలోచలనకు అక్షర రూపం ఇచ్చింది

ఆ సమయాన నాలో

ఉత్సాహం ఉప్పెనలా ఉరికింది

కలం కృష్ణలా కదిలింది

అక్షరం లక్ష అక్షౌహిణులుగా మారింది

నిజంగా ఆ గగన దేశాన ఉన్న తార,

తారగాక ఏ కవివరేణ్యుడో స్వర్గలోకాలు చేరి

అక్కడ కూడా తన వెలుగు విరజిమ్ముతూ

ప్రకాశిస్తుంటాడు..

ఆ వెలుగే నాకు ఉత్ప్రేరకమై

ఆ తేజస్సే నాకు ఆశీస్సుగా మారి

నాలో ఉన్న చిన్న

హృదయాన్ని స్పందింప చేసింది.

No comments: