18.3.08

నాకు నచ్చిన పాట

ముత్యమల్లె మెరిసిపొయే మల్లె మొగ్గా..
ముట్టుకుంటే ముడుసుకుంటావ్ ఇంత సిగ్గా..

మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే
ఊరూ నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే

కురిసే సన్నని వానా సలి సలిగా ఉన్నది లోనా
గుబులౌతుందే గుండెల్లొనా
జరగనా కొంచెం నేనడగనా లంచం
చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం
వెచ్చగ ఉందాము మనము..
హే పైటలాగా నన్ను నువ్వు కప్పుకొవే..
గుండెలోనా గువ్వలాగా ఉండిపోవే ..
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే

పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేలా అది తొలకరించు వేళా
తెలుసుకో పిల్ల ఈ బిడియమేల మళ్ళ
ఉరికే పరువమిదీ మనదీ

హే కాపుకొస్తే కాయలన్ని రాలిపొవా
జాముకొస్తే కొర్కెల్లన్ని తీరిపోవా
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే

5 comments:

నిషిగంధ said...

మంచి పాట గుర్తు చేశారు!! నాకీ పాటంటే చాలా ఇష్టం.. బాలు హై పిచ్ లో భలే మొదలుపెడతారు.. మసకేసిన మబ్బు, పొగమంచు మన కళ్ళముందుకి తెస్తారు!!

Anonymous said...

కృతజ్ఞతలు నిషిగంధ గారు..

Anonymous said...

మీ కవితలు చాలా చాలా బాగున్నాయి.
శివ,తణుకు.

Anonymous said...

మంచి పాట గుర్తు చేశారు!! నాకీ పాటంటే చాలా ఇష్టం.. మసకేసిన మబ్బు, పొగమంచు మన కళ్ళముందుకి తెస్తాయి!!

ఇలాంటి కవితలంటే నాకు ప్రాణం
మాదవీలత ,అత్తిలి ఫోన్ : 97041 92214

సుజాత వేల్పూరి said...

స్నేహితులు నలుగురు చేరినప్పుడు పాడుకోడం నుంచి , ఒక పెద్ద స్టేజి షో వరకూ ఈ నాటికీ అదరగొట్టేసే పాట. ఈపాటలో బాలు గొంతులో ఎంత మాధుర్యం ఒలుకుతుందంటే బాలు తో ప్రేమలో పడిపోవడానికి ఈ ఒక్క పాట చాలనిపిస్తుంది