26.2.08

తల్లి, తండ్రి మరియు గురువు.

మాతౄదేవో భవః, పితౄదేవో భవః, ఆచార్యదేవో భవః అన్నది మన ఆర్యోక్తి. ప్రతి మనిషి జీవితంలో ఈ ముగ్గురు వ్యక్తులకీ అంత ప్రాముఖ్యత ఉంది. తల్లి, తండ్రి, గురువు ఈ వరసక్రమం గురించి ఒక చిన్న వివరణ. ప్రతి మనిషీ తన జీవిత ప్రస్థానంలో మొదట కలిసే వ్యక్తి తల్లి ఆ తరువాతే మిగతా అందరూ. తల్లి, తండ్రి, గురువు అని చెప్పడం వెనుక అర్ధం తల్లి తన బిడ్డకు తండ్రిని పరిచయం చేస్తే ఆ తండ్రి ఆ బిడ్డని ఒక శ్రేష్టమయిన గురువుకి అప్పచెబుతాడు, ఆ గురువు ద్వారా సమాజాన్ని తెలుసుకుని, జ్ఞానాన్ని సముపార్జన చేసి సంఘంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. అందుకే మాతా పితరులను, గురువును దైవంతో సమానంగా కొలవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

No comments: