మన భారతీయ సంప్రదాయంలో త్రికోణానికి ఒక ప్రత్యేకత ఉంది. త్రికోణం యొక్క మూడు గీతలూ సౄష్టి యొక్క మూడు స్థాయిలను సూచిస్తుంది. త్రికాలాలు (భూత, భవిష్యత్ మరియు వర్తమానాలు), త్రిగుణాలు (సత్వ, రజో, తమో), త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు), సౄష్టి,స్థితి, లయాలు; స్త్రీ, పురుష, నపుంసకత్వం; ప్రారంభం, గమనం, అంతం; జననం, జీవితం మరియు మరణం మొదలగునట్టి ఎన్నో భావాలు త్రికోణం వ్యక్తం చేస్తుంది. ప్రారంభం చివరలో అంతం అయిపోవడం జీవి జీవిత చక్ర పరిభ్రమణాన్ని సూచిస్తుంది.
త్రికోణాన్ని ప్రపంచాన్ని నడిపే మూల శక్తిగా ఆధ్యాత్మికతలో గుర్తిస్తారు, పూజిస్తారు. త్రికోణాన్ని యంత్రంగా కూడా అంగీకరిస్తారు. మనం ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు కూడా మన దేహం త్రికోణాన్నే పోలి ఉంటుంది.
27.2.08
భారతీయ ఆధ్యాత్మికతలో త్రికోణం ప్రాముఖ్యత.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
మరో రా భ ణాసుర వ్యాఖ్యాణం :( !
Post a Comment