26.2.08

నిద్ర లేవగానే చేతులు ఎందుకు నేలకు ఆన్చాలి?

ఉదయాన నిద్ర లేవగానే కాసేపు అలానే పక్కలో కూర్చుని కాసేపు భగవంతుని ప్రార్థించి చేతులు నేలకు మొదట ఆన్చి తరువాత కాళ్ళు కింద పెట్టాలని మన పెద్దలు చెబుతూ మన పాదాలు నేలఫై పెట్టి భూమికి వత్తిడి కల్గిస్తాం కాబట్టి భూమాతను క్షమిమ్చమని పక్క దిగే ముందు ముందు చేతితో నేలను తాకాలని చెపుతారు. ఈ బోధన వెనుక ఉన్నశాస్త్రియత పరశిలిస్తే
నిద్రపోతున్న వారి శరీరంలో ప్రవహించే శక్తిని స్టాటిక్ ఎనర్జీ (Static Energy) అని లేదా పొటన్షియల్ ఎనర్జీ (Potential Energy) అని పిలుస్తారు, కానీ నిద్రమేల్కొని లేచి నిలబడినప్పుడు ఆ శక్తే డైనమిక్ ఎనర్జీ (Dynamic Energy) లేదా కెనెటిక్ ఎనర్జీ (Kinetic Energy) గా మారుతుంది. నిద్రపోతున్నప్పటి కెనటిక్ ఎనర్జీ స్వచ్ఛమైనది కాదు. కావున నిద్రమేల్కొని పక్కదిగే ముందు చేతితో భూమిని కాసేపు తాకడం వల్ల శరీరంలో ఉన్న అశుద్ధ శక్తి చేతిద్వారా బయటకు పోయి స్వచ్ఛమైన శక్తి శరీరంలోకి ప్రవహిస్తుంది. ఒకవేళ అలాకాక మొదట పాదాలనే భూమికి తాకించినట్లయితే శరీరంలోని శక్తి తరంగాలు క్రిందుగా ప్రవహించి శరీరాన్ని బలహీనపరుస్తుంది. అలాకాక మొదట చేతిని భూమిపై ఆనించి ఉంచిన ఒకే సమయంలో వ్యతిరేక శక్తి బయటకు వెళ్ళి అనుకూల శక్తి శరీరం నిండా నిండుతుంది. ఈ శాస్త్రీయతను దౄష్టిలో ఉంచుకునే మన పూర్వీకులు పడక దిగే ముందు చేతిని భూమికి తాకించి నమస్కరించమని చెప్పారు, ఆ విదంగా మనం జీవించడానికి చోటునిచిన భూమాతకు కూడా ప్రణామం చేసినట్లు కూడా అవుతుందని వారి భావన.

3 comments:

oremuna said...

మరో రా భ ణాసుర వ్యాఖ్యాణం :( !

Anonymous said...

కృతజ్ఞతలు ఒరెమూనా గారూ.. కానీ ఈ "రా భ ణాసుర" అన్న వాక్యానికి అర్ధం కొంచెం వివరింతురూ..

oremuna said...

అనగా అనగా ఓ రాజు

ఆ రాజుకో కూతురు

ఆ కూతురు చదువు చెప్పడానికి ఓ గురువు

ఈ గురువు కాస్తా ఆ యువరాణీ గారిని వలచి తన్నే పెండ్లాడమంటాడు, కానీ యువరాణి ఒప్పుకోదు, దానితో పగబట్టిన ఆ గురువు శుద్ద మొద్దును, ఎందుకూ పనికి రాని వాణ్ణీ యువరాణికి పెండ్లి చేద్దామని ఓ బడుదాయిని వెతికి పట్టుకోని వస్తాడు. ఆ బడుద్దాయే తరువాత కాళిదాసు అవుతాడనుకోండి అది వేరే విషయం.

మన ప్రస్తుత విషయానికి వస్తే,

కాళిదాసు గొప్ప పండితుడు, యువరాణీ వారికి సరి అయిన వరుడు అని సభలో అందరికీ పరిచయం చేస్తాడు.

ఆ సభలో కాళీదాసు మాటల సందర్బములో "రాభణాసురా" అంటాడు!

అందరూ ఆశ్చర్యపోతారు, కనీసం రావణాసురుడు అని పలకడం కూడా రాని వాడు ఏం పండితుడూ అని.

అప్పుడు మన గురువు గారు ఏమాత్రం అధైర్యపడకుండా

విభీషణుడు, కుంభకర్ణుడు ఇద్దరు అన్నదమ్ములకు భ ఉన్నది కదా, రావణాసురునికి కూడా భ ఉంటే బాగుంటుంది అని మహా పండితుని చమత్కారం అని పేద్ద ఉపన్యాసం చెపుతాడు.

ఇలా ఏ విషయాన్ని అయినా పేద్ద లజిక్ తో సమర్ధించడాన్ని రాభణాసుర వ్యాఖ్యానం అనాలని ఓ తీర్మానం:)